Tuesday 26 September 2017

అమ్మ ప్రేమ‌...


అమ్మ‌కు ఇవ్వ‌లేము నిర్వ‌చ‌నం....
అమ్మ ప్రేమ‌కు క‌ట్ట‌లేము అడ్డుగోడ‌లు...
అమ్మ త్యాగానికి సాటి రాదేది...
త‌న పేగుతో మ‌న‌కు బంధాన్ని ఏర్ప‌రుస్తుంది ... 
చ‌నుబాల అమృతంతో దీర్ఘాయువును ప్రసాదిస్తుంది ...
ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లు ఎదుగుతున్న త‌న పిల్ల‌ల‌ను చూసి ఆనందిస్తుంది ...
త‌న బిడ్డ‌ల‌ను కోపంతో నాలుగు మాట‌లంటే ... నాలుగు రోజులు బాధ ప‌డుతుంది ....
ప్రేమ‌గా త‌న పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొని... ఆనందిస్తుంది...
త‌న జీవిత‌మే వారికోసం అన్నంతగా... ప‌రిత‌పిస్తుంది....
పిల్ల‌లు పెద్ద‌వారై.... త‌న ప‌నులను త‌ప్పు ప‌డుతుంటే.. త‌న‌లో తానే రోధిస్తుంది... కానీ ఏమీ అన‌దు...
జీవిత‌మంతా పిల్ల‌ల శ్రేయ‌స్సునే కోరే... అమ్మ .... వారి నుంచి ఆశించేదీ ఏమీ? గుప్పెడు ప్రేమ తప్పా...!
త‌న చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగి, ఎదిగిన కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపేప్పుడు ..
ఆ త‌ల్లి ప‌డే బాధ వ‌ర్ణించ‌గ‌ల‌మా....?
అమ్మ బంధం ధృడ‌మైనది.... అమ్మ ప్రేమ‌ అనంత‌మైనది.... అమ్మ త్యాగం అనీర్వ‌చ‌నీయమైన‌ది...